Raptadu: రాప్తాడుపై ఓ కన్నేయండి సార్: ఎన్నికల సంఘానికి విజయసాయి రెడ్డి వినతి

  • ఎన్నికల కోడ్ అమలు కావడం లేదు
  • తోపుదుర్తి ప్రకాశ్ ను పోలీసులు అడ్డుకుంటున్నారు
  • ప్రత్యేక నిఘా పెట్టాలని విజయసాయి వినతి
అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘాను పెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలు కావడం లేదని ఆరోపించిన ఆయన, తమ పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ప్రచారాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలను బెదిరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కి పోలీసులే తెలుగుదేశం ప్రచారకర్తలుగా మారారు. ఎన్నికల కమిషన్‌ రాప్తాడుపై ప్రత్యేక నిఘా పెట్టాలి" అని అన్నారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.
Raptadu
Vijayasai
Twitter
Topudurti Prakash Reddy
Paritala Sriram

More Telugu News