Tirumala: తిరుమల కొండపై.. పార్టీ కండువాలతో వైసీపీ నాయకుల ప్రచారం

  • నిబంధనలకు విరుద్ధమని విమర్శలు
  • బాలాజీనగర్‌లో ప్రచారం చేసిన నేతలు
  • సాధారణ దుస్తుల్లో వచ్చి ప్రచారం చేయాలని నిబంధన
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై ఉన్న బాలాజీనగర్‌లో పార్టీ కండువాలు మెడలో వేసుకుని ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల కొండపై రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం నిషిద్ధం.  ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు సాధారణ దుస్తుల్లో వచ్చి స్థానిక ఓటర్లను కలుసుకుని ఓట్లను అభ్యర్థించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ వైసీపీ నాయకులు దీన్ని పట్టించుకోలేదు. కొందరు నేతలు, కార్యకర్తలు మెడలో పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేసి నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. 
Tirumala
YSRCP
election campain

More Telugu News