Vadivukkarasi: సీనియర్ నటి వడివుక్కరసి ఇంట్లో దొంగతనం

  • చెన్నై, టీ-నగర్ లో నివాసం ఉంటున్న నటి
  • కుమార్తె ఇంటికి వెళ్లొచ్చేసరికి దొంగతనం
  • కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ప్రముఖ తమిళనటి, ఎన్నో తెలుగు సినిమాల్లోనూ కనిపించిన వడివుక్కరసి ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నై, టీ-నగర్ పరిధిలోని పాండీ బజార్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రామన్‌ వీధిలో నివాసం ఉంటున్న వడివుక్కరసి, పది రోజుల క్రితం అదే వీధిలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లారు. ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువా పగులగొట్టబడివుంది. దానిలోని 8 సవర్ల బంగారు నగలను దుండగులు చోరీ చేసినట్టు గుర్తించారామె. దీనిపై పోలీసులను ఆమె ఆశ్రయించగా, కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. 
Vadivukkarasi
Tamilnadu
Chennai
Theft
Actress
Police

More Telugu News