Tollywood: మోహన్ బాబు హౌస్ అరెస్ట్... కాలు బయటపెట్టకుండా భారీ ఎత్తున పోలీసుల మోహరింపు

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు గృహ నిర్బంధం విధించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తోందంటూ మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత హోదాలో తిరుపతిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం ఉండడంతో మోహన్ బాబు ర్యాలీ అవాంఛనీయ ఘటనలకు దారితీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు ఈ ర్యాలీని అనుమతించడంలేదు.

 ఈ క్రమంలో మోహన్ బాబును  బయటికి రానివ్వకుండా నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. శుక్రవారం ఉదయం వేల సంఖ్యలో విద్యార్థులతో విద్యానికేతన్ క్యాంపస్ నుంచి తిరుపతి నగరం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలన్నది మోహన్ బాబు ఆలోచన. అయితే, ర్యాలీకి ముందే ఆయన్ను గృహనిర్బంధం చేయడంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Go Back to Shorts
Tollywood
Andhra Pradesh
Tirupati

More Telugu News