Vijayasai Reddy: కొలిమిలో కర్రు కాలుతోంది... ఏప్రిల్ 11న వాతే!: విజయసాయిరెడ్డి

  • ప్రజల జ్ఞాపకశక్తిపై చంద్రబాబుకు చిన్నచూపు
  • టీడీపీకి ఓటర్లు బుద్ధి చెప్పనున్నారు
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ట్వీట్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటర్లు బుద్ధి చెప్పనున్నారని, అందుకోసం కర్రుకు కొలిమిలో వేడి చేయడం మొదలు పెట్టారని, 11వ తేదీన వాతలు పెడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "ప్రజల జ్ఞాపక శక్తి, మేధస్సుపై చంద్రబాబుకు చిన్నచూపు ఉంది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టిన దగ్గర నుంచి సంక్రాంతికి గ్రామాలకు వెళ్లి పండుగ చేసుకోవాలనేది కూడా తమను చూసే ప్రజలు అలవాటు చేసుకున్నారన్నప్పుడే కర్రును కొలిమిలో వేడి చేయడం మొదలు పెట్టారు. ఏప్రిల్ 11న వాతలు పెడతారు." అని ఆయన వ్యాఖ్యానించారు.



Vijayasai Reddy
Twitter
Elections
Chandrababu

More Telugu News