Andhra Pradesh: తెలుగులో కొంచెం అటూఇటూగా లోకేశ్ మాట్లాడటాన్ని తప్పుబట్టొద్దు: దివ్యవాణి

  • ఆ విషయాన్ని పెద్దది చేసి చూపించొద్దు
  • లోకేశ్ చెప్పే మాటల్లో భావనను అర్థం చేసుకోండి
  • లోకేశ్ బాబు చాలా జ్ఞానం కల్గిన వ్యక్తి
ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ప్రసంగంలో పొరపాటున ఉపయోగించే పదజాలం కారణంగా ఆయనపై విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి స్పందించారు. గతంలో లోకేశ్ తన చదువు నిమిత్తం విదేశాల్లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. తెలుగులో కొంచెం అటూఇటూగా లోకేశ్ మాట్లాడటాన్ని తప్పుబట్టడం, ఆ విషయాన్ని పెద్దది చేసి చూపడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

 లోకేశ్ కు తెలుగు రాకపోవచ్చు కానీ, ఆయన చెప్పే మాటల్లో భావనను అర్థం చేసుకోలేని అమాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదని అన్నారు. లోకేశ్ బాబు చాలా జ్ఞానం కల్గిన వ్యక్తి అని, ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఎలా ముందుకెళ్లాలన్న విషయం ఆయనతో ఉన్న వాళ్లకు తెలుస్తుందని చెప్పారు. ఇటు ఐటీ రంగంలో కానీ, గ్రామీణంలో కానీ లోకేశ్ తన ఆలోచనలతో ఎంత మేరకు అభివృద్ధి చేశారో చూస్తున్నామని అన్నారు. 
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Divya vani

More Telugu News