మరో సినిమాను కూడా ప్రకటించేసిన నితిన్
- త్వరలో సెట్స్ పైకి 'భీష్మ'
- తరువాత సినిమా చంద్రశేఖర్ యేలేటితో
- ఆగస్టులో రమేశ్ వర్మతో సినిమా
చెప్పినట్టుగానే నితిన్ ఆ రెండు సినిమాల విశేషాలను ఈ రోజున అభిమానుల ముందుంచాడు. రమేశ్ వర్మతో ఒక సినిమా ఉంటుందనీ .. అది ఆగస్టులో సెట్స్ పైకి వెళుతుందని ఆయన చెప్పాడు. అలాగే ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందనీ, అది ఏప్రిల్ రెండవ వారంలో సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తారని స్పష్టం చేశాడు.