Chittoor District: నగరిలో ఉన్న ఓ శూర్పణఖ.. రోజాపై దివ్యవాణి పరోక్ష వ్యాఖ్యలు!

  • జగన్ ని రావణాసురుడిగా, రోజాను శూర్పణఖగా అభివర్ణించిన దివ్యవాణి
  • బాబు కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు
  • జగన్ కు ఓటేస్తే పరోక్షంగా మోదీకి, కేసీఆర్ కు వేసినట్టే
వైసీపీ అధినేత జగన్ ని రావణాసురుడిగా, ఆ పార్టీ నేత రోజాను శూర్పణఖగా అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు కష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్లు, అభివృద్ధి పథకాలపై బురదజల్లే కార్యక్రమానికి ఓ రావణాసురుడు, శూర్పణఖ పాల్పడుతున్నారంటూ జగన్, రోజాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తమ కుటుంబంలోని సొంత బాబాయ్ ప్రాణాలనే కాపాడుకోలేని వ్యక్తి, ఐదు కోట్ల ప్రజలను ఆయన కాపాడతాడనేది నమ్మశక్యంగా లేదని జగన్ పై విమర్శలు చేశారు. జగన్ కు ఓటేస్తే పరోక్షంగా మోదీకి, కేసీఆర్ కు వెళ్లిపోతాయని అన్నారు. మన రాష్ట్ర అభివృద్ధికి వాళ్లిద్దరూ పెద్ద అడ్డంకులుగా ఉన్నారని, జగన్ వాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని దివ్యవాణి విమర్శించారు.
Chittoor District
Nagari
YSRCP
Roja
Telugudesam

More Telugu News