KTR: కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు

  • నామాను సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్
  • నామాతో పాటు పలువురు టీడీపీ నేతల చేరిక
  • కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. ఈ సందర్భంగా నామాకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నామాతో పాటు టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణ కుమారి, అమర్ నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో పాలు పలువురు నేతలు హాజరయ్యారు. మరోవైపు, నామా నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్ సభ స్థానాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
KTR
nama nageswar rao
TRS
Telugudesam

More Telugu News