TRS: టీఆర్‌ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే

  • రేపు కేసీఆర్‌ సమక్షంలో అధికారికంగా చేరే అవకాశం
  • కేటీఆర్‌తో భేటీ అయన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి
  • గతంలో షాద్‌నగర్‌ నుంచి ప్రాతినిధ్యం
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో టీఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, మాజీలు, ద్వితీయశ్రేణి నాయకులు కారెక్కేందుకు ఆరాటపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి చేరారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ దామోదరరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత జూపల్లి భాస్కర్‌తో కలిసి ఈ రోజు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో అధికారికంగా టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. ప్రతాపరెడ్డి గతంలో షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
TRS
Congress
pratapreddy
shadnagar

More Telugu News