Revanth Reddy: ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం ఇదే!

  • ఏపీలో ఎవరు గెలుస్తారో నాకు తెలియదు
  • ఏపీ రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు
  • పక్క రాష్ట్ర రాజకీయాల గురించి నాకు తెలియదు
ఏపీలో ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు తోడు జనసేన కూడా గెలుపుకోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయిలో వస్తున్న పలు సర్వేలు కూడా జనాల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందుతుందనే ప్రశ్న మీడియా నుంచి టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఎదురైంది. దీనికి సమాధానంగా... ఏపీలో ఎవరు గెలుస్తారో తాను చెప్పలేనని ఆయన అన్నారు. ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి తనకు తెలియదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి రేవంత్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 
Revanth Reddy
congress
ap
politics

More Telugu News