akhil: రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అఖిల్ మూవీ

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్ 
  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం 
  • త్వరలోనే సెట్స్ పైకి    
రొమాంటిక్ హీరోకి కావలసిన లక్షణాలు అఖిల్ లో పుష్కలంగా వున్నాయి. అయినా ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. నటన పరంగా .. డాన్స్ పరంగా అఖిల్ కి మంచి మార్కులు పడినా, కథా కథనాల లోపం కారణంగా ఆ సినిమాలు సరిగ్గా ఆడలేదు. అందువల్లనే ఆయన తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.

'బొమ్మరిల్లు' భాస్కర్ వినిపించిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన, ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులను 'బొమ్మరిల్లు' భాస్కర్ ముగింపు దశకి తీసుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుండటం విశేషం. కథానాయిక ఎవరనే విషయం త్వరలోనే తెలియనుంది.
akhil

More Telugu News