shatrughan sinha: బీజేపీ అసమ్మతి నేత శతృఘ్న సిన్హాకు కాంగ్రెస్ టికెట్?

  • పాట్నా సాహిబ్ నుంచి బరిలోకి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్?
  • శతృఘ్న సిన్హాను అదే స్థానం నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ వ్యూహం
  • త్వరలోనే కాంగ్రెస్ తీర్థం?
గత కొంతకాలంగా బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న ప్రముఖ నటుడు, సీనియర్ నేత శతృఘ్న సిన్హాను కాంగ్రెస్ అక్కున చేర్చుకునేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయనకు పాట్నా సాహిబ్ నుంచి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.

సిట్టింగ్ స్థానమైన పాట్నా సాహిబ్ నుంచే తాను తిరిగి బరిలోకి దిగనున్నట్టు శతృఘ్న సిన్హా ఇప్పటికే ప్రకటించారు. అయితే, బీజేపీ మాత్రం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆ స్థానంలో పోటీకి దించాలని భావిస్తోంది. గత కొంతకాలంగా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సిన్హా ఇటీవల బెంగాల్‌లో ప్రతిపక్షాలు నిర్వహించిన ఐక్యతా ర్యాలీలోనూ పాల్గొన్నారు.
shatrughan sinha
BJP
Congress
Patna sahib
Bihar
JDS

More Telugu News