Telangana: పార్టీ నడపడం చేతకాక కాంగ్రెస్ నేతలు మాపై పడి ఏడుస్తున్నారు: టీ-మంత్రి తలసాని

  • తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు
  • టీ-కాంగ్రెస్ భూస్థాపితమైంది
  • మతాన్ని నమ్ముకుని ఓట్లు అడిగే పార్టీ బీజేపీ
తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలకు తమ పార్టీ నడపడం చేతకాక తమపై పడి ఏడుస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలు దద్దమ్మల్లా మారారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన విరుచుకుపడ్డారు. మతాన్ని నమ్ముకుని, అమ్ముకుని ఓట్లు అడిగే పార్టీ బీజేపీ అని, దేశానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని దుమ్మెత్తి పోశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ గెలిస్తే, కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన వాటిని తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Telangana
t-congress
minister
talasani
srinivas

More Telugu News