kamal: 'భారతీయుడు 2' ముందుకు వెళ్లకపోవడానికి అసలు కారణం అదేనట!

షార్ట్స్‌లో చూడండి
శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆయన అప్పటి నుంచి అనుకుంటూనే వున్నాడు. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ ను ఆయన పట్టాలెక్కించగలిగాడు. కమల్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా కాజల్ కనిపించనుంది.

ఈ సినిమా తొలి షెడ్యూల్ సమయంలోను .. ఆ తరువాత షూటింగు విషయంలో గ్యాప్ ఎక్కువగా వస్తోంది. అనుకున్నట్టుగా షూటింగు జరగకపోవడంతో, దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. కానీ షూటింగు సవ్యంగా సాగకపోవడానికి అసలు కారణం కమల్ మేకప్ అని తెలుస్తోంది. గతంలో కమల్ కి సేనాపతి పాత్రకి గాను వృద్ధుడిగా మేకప్ వేస్తే ఏమీ కాలేదు. కానీ ఈ సారి ఆయనకి వృద్ధుడిగా మేకప్ వేసిన ప్రతిసారి స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారట. అందువల్లనే షూటింగ్ ఆపారని అంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి. 
Go Back to Shorts
kamal
kajal

More Telugu News