bjp: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. 20 మంది నేతలతో మంతనాలు

  • ఇప్పటికే బీజేపీలో చేరిన డీకే అరుణ
  • అసంతృప్తులకు ఆహ్వానం పలుకుతున్న బీజేపీ
  • కీలక నేతలతో కొనసాగుతున్న చర్చలు
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు ఆహ్వానం పలుకుతోంది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దాదాపు 20 మంది ముఖ్య నేతలతో బీజేపీ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితా విడుదలైన తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.
bjp
telangana
operation akarsh
TRS
Congress

More Telugu News