ntr: 'ఆర్ఆర్ఆర్' మూవీలో కీలకమైన పాత్రలో సంజయ్ దత్?

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ 
  • కీలకమైన పాత్రలో అజయ్ దేవగణ్ 
  • తెరపైకి సంజయ్ .. షాహిద్ పేర్లు  
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. స్వాతంత్య్రం రాకమునుపు కథ కావడంతో, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను ఎంచుకున్నారు. ఒక కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగణ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాలను రాజమౌళి స్వయంగా చెప్పారు.

ఇక మరో రెండు కీలకమైన పాత్రల కోసం కూడా బాలీవుడ్ హీరోలను తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంజయ్ దత్ తోను .. షాహిద్ కపూర్ తోను సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. చారిత్రక నేపథ్యంలో తయారు చేసుకున్న కథ కావడం వలన, విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలు చాలానే వున్నాయట. ఆ పాత్రలకి స్టార్స్ ను తీసుకోవడం వలన, మార్కెట్ పరంగా మరింత కలిసొస్తుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ntr
charan
alia bhatt

More Telugu News