Virat Kohli: కోహ్లీ చురుకైన కెప్టెన్ కాదు.. గొప్ప వ్యూహాలు కూడా రచించలేడు: గంభీర్

  • ఐపీఎల్ లో బెంగళూరుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు
  • ధోనీ, రోహిత్ లు మూడేసి కప్ లు సాధించారు
  • కోహ్లీ చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది
విరాట్ కోహ్లీ కంటే ధోనీ, రోహిత్ శర్మలే గొప్ప కెప్టెన్లని టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో ధోనీ, రోహిత్ లు కెప్టెన్లుగా తమ చెన్నై, ముంబై జట్లకు మూడేసి టైటిళ్లను అందించారని... బెంగళూరు సారథిగా కోహ్లీ ఇప్పటి వరకు ఒక టైటిల్ కూడా అందుకోలేకపోయాడని చెప్పాడు. కోహ్లీ తనకు అంత చురుకైన కెప్టెన్ గా కనిపించడని, గొప్ప వ్యూహాలను కూడా రచించలేడని అన్నాడు.

గెలుపు రికార్డును బట్టే ఒక కెప్టెన్ ప్రతిభను అంచనా వేస్తామని... మూడేసి సార్లు కప్పు గెలిచిన ధోనీ, రోహిత్ లతో కోహ్లీని పోల్చలేమని చెప్పాడు. కోహ్లీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అన్నాడు. ఏడెనిమిదేళ్లుగా బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ, ఇంతవరకు ఒక్క టైటిల్ ను కూడా గెలవని కోహ్లీని ఆ ఫ్రాంఛైజీ ఇంకా కెప్టెన్ గా కొనసాగిస్తుండటం గొప్ప విషయమేనని చెప్పాడు.
Virat Kohli
MS Dhoni
Rohit Sharma
gowtam gambhir
ipl

More Telugu News