Andhra Pradesh: కృష్ణా జిల్లాలో బాంబు కలకలం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు!

  • మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో ఘటన
  • విశ్వసనీయ సమాచారంతో పోలీసుల తనిఖీలు
  • ఎవరిపైన లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాంబు కలకలం చెలరేగింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలో బాంబును దాచినట్లు పోలీసులకు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు ఇంగ్లీష్ పాలెంలోని ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో దాచిన బాంబును స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపామనీ, విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బాంబును ఎవరు తెచ్చారు? దాడి చేయడానికి సిద్ధమవుతున్నారా? ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు చెప్పారు.
Andhra Pradesh
Krishna District
bomb

More Telugu News