Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న డీకే అరుణ

  • తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ
  • అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా
  • మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభ బరిలోకి
తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన ఆమె కాంగ్రెస్‌ను వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చొరవతో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అరుణ టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అరుణ అనూహ్య నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరడం సొంతపార్టీ నేతలను కలవరపరుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు సమాచారం.
Congress
Telangana
Mahabubnagar
Gadwal
DK Aruna
BJP
Amit Shah

More Telugu News