t-congress: ‘కాంగ్రెస్’ను వీడనున్న డీకే అరుణ?

  • బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న అరుణ
  • డీకే అరుణ నివాసంలో రామ్ మాధవ్  చర్చలు
  • సుమారు 45 నిమిషాలకు పైగా మంతనాలు
టీ-కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడారు. మహబూబ్ నగర్ కు చెందిన సీనియర్ నేత డీకే అరుణ కూడా ఇదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. రెండు రోజుల కిందట ఆమె ఢిల్లీ వెళ్లారని, బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. డీకే అరుణ నివాసంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ ఈరోజు చర్చలు జరిపినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 45 నిమిషాలకు పైగా వారి మధ్య మంతనాలు జరిగాయని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆమె ఫోన్ లో మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ తరపున మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి డీకే అరుణ పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
t-congress
mahabub nagara
gadwal
DK Aruna
BJP
Amit Shah
Ram Madhav

More Telugu News