Babu Rajendraprasad: నేను తిన్నాను..నేను జైల్లో ఉన్నాను.. అని జగన్ అనాలి: బాబు రాజేంద్ర ప్రసాద్
- కార్యకర్తలు లంచాలు తీసుకున్నారు
- జగన్‌కే ఆ లంచాల మీద కాపీ రైట్స్ ఉన్నాయి
- మాపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు
వైసీపీ అధినేత జగన్.. ‘నేను తిన్నాను.. జైల్లో ఉన్నాను’ అని చెబితే ఆయనకు చాలా బాగా సెట్ అవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కొయ్యలగూడెం సభలో అన్నీ అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. ‘‘మా ప్రభుత్వం అసత్యాల మయమైందని.. ఇల్లు కానీ.. పింఛన్ కావాలన్నా.. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా.. చంద్రన్న బీమాకు కూడా టీడీపీ కార్యకర్తలు లంచాలు తీసుకున్నారని జగన్ సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. జగన్‌కు, ఆయన అనుచరగణానికే.. ఆ లంచాల మీద కాపీ రైట్స్ ఉన్నాయి. మేము అందించే సంక్షేమ పథకాలు లబ్ధి దారులకు ఎక్కడా మధ్యవర్తులు లేకుండా చూసేందుకు దళారీ వ్యవస్థనే రూపుమాపాం" అన్నారు.
అన్నీ కూడా మీసేవా, ఈసేవా సెంటర్లలో నమోదు చేసుకునేలా చేశాం. దళారీ వ్యవస్థే లేనపుడు లంచాల ప్రసక్తి ఎక్కడ ఉంది? మాపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. జగన్ ఈ మధ్య ‘నేను విన్నాను.. నేనున్నాను’ అనే సినిమా డైలాగ్‌లు చెబుతున్నాడు. దాన్ని స్వల్ప మార్పులు చేసుకుంటే ఆయనకి బాగా సెట్ అవుతుంది. ‘నేను తిన్నాను.. నేను జైల్లో ఉన్నాను’ అని పెట్టుకుంటే జగన్‌కు బాగా సెట్ అవుతుంది. ఈ డైలాగును ప్రతి బహిరంగ సభలో ఆయన వాడుకుంటే మంచిది’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.