Andhra Pradesh: టీడీపీకి గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ రాజీనామా.. వైసీపీలో చేరిక

  • వైసీపీలో చేరనున్న జానీమూన్
  • ‘జనసేన’కు గుడ్ బై చెప్పిన యర్రా నవీన్
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నవీన్
గుంటూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ జానీమూన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కుమారుడు, జనసేన పార్టీ నేత నవీన్ కూడా పార్టీ మారారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో నిర్వహించిన సభలో నవీన్ కు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు.
Andhra Pradesh
Gunntur
Telugudesam
zp chair person
johnymoon
YSRCP
Jagan

More Telugu News