cuddapah: జమ్మలమడుగులో వైసీపీ నేత మహేశ్ రెడ్డి వాహనం ధ్వంసం.. వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఘర్షణ!

  • వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్ రెడ్డి వాహనం ధ్వంసం
  • టీడీపీ కార్యకర్తల పనేనంటూ వైసీపీ ఆరోపణలు
  • అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైసీపీ శ్రేణుల ధర్నా 

కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు మహేశ్ రెడ్డి వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. సంఘటనా స్థలానికి వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి చేరుకున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. కాగా, టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గీయులు తమ వాహనాన్ని ధ్వంసం చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
cuddapah
jammala madugu
YSRCP
Telugudesam
mahesh reddy
rama subba reddy
avinash reddy

More Telugu News