jagan: విజయమ్మ, షర్మిల కోసం రెడీ అవుతున్న ప్రత్యేక బస్సులు

  • ప్రచార రంగంలోకి విజయమ్మ, షర్మిల
  • 27న మంగళగిరి నుంచి షర్మిల ప్రచారం
  • 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న విజయమ్మ
ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ ముమ్మరం చేసింది. పార్టీ అధినేత జగన్ ఇప్పటికే సుడిగాలి పర్యటనలను ప్రారంభించారు. పోలింగ్ కు అతి తక్కువ సమయం ఉండటంతో... ప్రతి రోజు పలు బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు తోడుగా ఎన్నికల ప్రచార రంగంలోకి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దిగబోతున్నారు. వీరిద్దరి కోసం వైసీపీ వేర్వేరుగా ప్రత్యేక బస్సులను రెడీ చేస్తోంది. ఈ నెల 27న మంగళగిరి నుంచి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. మొత్తం 10 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో 40 నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేయనున్నారు.
jagan
vijayamma
sharmila
ysrcp
campaign
bus

More Telugu News