Chandrababu: చంద్రబాబుతో భేటీ అయిన సబ్బం హరి

  • తాజా రాజకీయాలపై చర్చ
  • భీమిలి టికెట్ ను సబ్బం హరికి ఖరారు చేసిన చంద్రబాబు
  • అవంతి శ్రీనివాస్ ను ఎదుర్కోనున్న సబ్బం హరి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. విశాఖ జిల్లా భీమిలి టికెట్ ను సబ్బం హరికి చంద్రబాబు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి టీడీపీలోకి సబ్బం హరి వెళ్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కానీ, టీడీపీ తీర్థాన్ని ఆయన పుచ్చుకోలేదు. అయినప్పటికీ, భీమిలి టికెట్ ను ఆయనకు చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తో సబ్బం హరి తలపడనున్నారు.
Chandrababu
sabbam hari
Telugudesam
bheemili

More Telugu News