Kurnool District: కర్నూల్‌ జిల్లాలో వైసీపీకి షాక్‌...టీడీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే

  • ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సమక్షంలో చేరిక
  • వైసీపీ నుంచి టికెట్టు ఆశించి భంగపడిన నేత
  • దంత వైద్యుడు జరదొడ్డి సుధాకర్‌కు వైసీపీ టికెట్టు
ఎన్నిక వేళ కూడికలు, తీసివేతలే కీలకం. అటు వారు ఇటు, ఇటు వారు అటూ జంపింగ్‌లు సహజం. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ‘ఆ గట్టు నుంచి ఈ గట్టుకు...ఈ గట్టు నుంచి ఆ గట్టుకు’ చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో, తాజాగా కర్నూల్‌ జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి పసుపు కండువా కప్పుకున్నారు. కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్  పార్టీ తరపున కోడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశించిన మురళీకి భంగపాటు ఎదురైంది. దంత వైద్యుడిగా స్థానికంగా సుపరిచితుడైన జరదొడ్డి సుధాకర్‌కు వైసీపీ టికెట్టు కేటాయించడంతో మురళి నిరాశ చెందారు. దీంతో ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేసి సైకిలెక్కారు.
Kurnool District
kodumuru
ex mla murali
Telugudesam

More Telugu News