manchu manoj: సిరిసిల్ల బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్

  • సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్వితను దత్తత తీసుకున్న మనోజ్
  • పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానంటూ ట్వీట్
  • ఐఏఎస్ కావాలనే ఆమె ఆశయానికి అండగా ఉంటానన్న హీరో
సామాజికసేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉండే సినీ నటుడు మంచు మనోజ్... తాజాగా ఓ బాలికను దత్తత తీసుకుని తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు. తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ లో ఆమెను చేర్పించారు. పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేశాడు. పాపను జాగ్రత్తగా చూసుకుంటానని... ఐఏఎస్ అధికారి కావాలనేది పాప ఆశయమని... ఆమె అనుకున్నది సాధించేందుకు కావాల్సినదంతా చేస్తానని తెలిపాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పాడు.
manchu manoj
mohanbabu
girl
adopt
tollywood

More Telugu News