Anil Ambani: తమ్ముడు జైలుకెళ్లకుండా ఆదుకున్న అన్న... భారీ లాభాల్లో అనిల్ అంబానీ షేర్లు!

  • వందల కోట్ల మొత్తాన్ని సర్దిన ముఖేష్ అంబానీ
  • 10 శాతానికి పైగా లాభపడ్డ ఆర్ కామ్
  • 5 శాతం పెరిగిన రిలయన్స్ పవర్
ఎరిక్సన్ కు చెల్లించాల్సిన వందల కోట్ల మొత్తాన్ని సర్దిన ముఖేష్ అంబానీ, తమ్ముడు జైలుకు వెళ్లకుండా ఆదుకోగా, ఈ వార్త ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచింది. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే అనిల్ దీరూభాయ్ అంబానీ (అడాగ్) సంస్థల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు వచ్చింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 10 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ పవర్ 5 శాతం పెరిగింది. రిలయన్స్ ఇన్ ఫ్రా, రిలయన్స్ కాపిటల్ తదితర కంపెనీల ఈక్విటీ వాటాలూ లాభాల్లో దూసుకెళుతున్నాయి. మొత్తం మీద నేటి ట్రేడింగ్ లో ఆటో, టెక్ రంగాలు నష్టాల్లో నడుస్తుండగా, బ్యాకింగ్, ఫార్మా కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 50, నిఫ్టీ 18 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.
Anil Ambani
ADAG
Mukesh Ambani
BSE

More Telugu News