Pawan Kalyan: పవన్ సీటు ఖరారు.. గాజువాక నుంచి బరిలోకి?

  • ఆదివారం అర్ధరాత్రి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన పవన్
  • మరో రెండు రోజుల్లో తానెక్కడి నుంచి పోటీ చేసేది ప్రకటించనున్న పవన్
  • గాజువాకనే ఫిక్స్ చేసుకున్న జనసేనాని?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఏపీ శాసనసభకు పోటీ చేసే 13 మంది అభ్యర్థుల జాబితాతోపాటు ఒంగోలు లోక్‌సభ స్థానానికి ఆదివారం అర్ధరాత్రి పవన్ అభ్యర్థిని ప్రకటించారు. కాగా, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై ఇన్నాళ్లూ కొనసాగిన సస్పెన్స్ దాదాపు వీడింది. విశాఖపట్టణంలోని గాజువాకను పవన్ ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పవన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Visakhapatnam District
Gajuwaka

More Telugu News