Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మధ్యవయస్కురాలిగా కీర్తి 
  • తన బేబీ గురించి సమంత
  • వర్మ సినిమా వాయిదా పడుతుందా?
*  అందాలతార కీర్తి సురేశ్ హిందీలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించిన సంగతి విదితమే. ప్రఖ్యాత భారత ఫుట్ బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా రూపొందే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. అతని భార్యగా కీర్తి నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ఇందులో కొంత భాగంలో కీర్తి మధ్య వయస్కురాలిగా కూడా కనిపిస్తుందట.
*  తాజాగా 'మజిలీ' చిత్రంలో నటించిన కథానాయిక సమంత మాతృత్వం గురించి తన మనసులోని మాటను వెల్లడించింది. 'తల్లిని అయితే కనుక నటన నుంచి బ్రేక్ తీసుకుంటాను. అప్పుడు నా బేబీనే నా ప్రపంచం అవుతుంది. నా బాల్యంలో నేను చాలా కష్టాలు పడ్డాను. నా బేబీ మాత్రం అలాంటివి పడకూడదు' అని చెప్పింది.
*  రాంగోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సెన్సార్ నుంచి రేపు క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నారు. దీంతో మొదట్లో ప్రకటించినట్టుగా ఈ నెల 22న కాకుండా 29న చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Keerthi Suresh
Samantha
Ajay
Varma
NTR

More Telugu News