AP: జగన్, కేటీఆర్ లు గుండెలు బాదుకోవడం ఖాయం: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన

  • గజదొంగ జగన్ కోసం కేటీఆర్ దొంగ అవతారమెత్తారు
  • తెలంగాణ ప్రజలను కేటీఆర్ వదిలేశారు
  • జగన్ కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నారు
గజదొంగ జగన్ కోసం కేటీఆర్ దొంగ అవతారమెత్తారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి రేయింబవళ్లు జగన్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు పార్ట్ టైమ్, వైసీపీకు ఫుల్ టైమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పిట్టల దొరలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ రాజకీయాలపై కేటీఆర్ కు అంతగా ఆసక్తి ఉంటే  పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒంటరిగా లేదా జగన్ తో కలిసి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోగలరా? అని కేటీఆర్ ని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్, కేటీఆర్ లు గుండెలు బాదుకోవడం ఖాయమన్న మంతెన, టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్ద కేసీఆర్ పనిచేశారనే మాటలో తప్పేముంది? అని ప్రశ్నించారు. టీడీపీ వల్లే కేసీఆర్ ఎదిగారన్న విషయాన్ని కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు.
AP
Telangana
TRS
Telugudesam
YSRCP
Jagan
KTR
mantena
mlc
satyanarayana raju
kcr

More Telugu News