Telugudesam: రాబోయే రెండేళ్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ పనులు పూర్తి చేస్తాం: కేటీఆర్

  • నాగోల్ లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభ
  • ఎలాంటి కాలుష్యం లేకుండా ఈ సిటీని ఏర్పాటు చేస్తాం
  • మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావాలి: కేటీఆర్
రాబోయే రెండేళ్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ పనులు పూర్తి చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. నాగోల్ లో భువనగిరి పారిశ్రామిక ప్రగతి నివేదన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 19 వేల ఎకరాల్లో ఎలాంటి కాలుష్యం లేకుండా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ని ఏర్పాటు చేస్తామని అన్నారు. మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావాలని కోరుకుంటున్నానని, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ శివారులో త్వరలోనే ఫర్నీచర్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నామని, దేశంలోనే అతిపెద్ద డ్రైపోర్ట్ ను నకిరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని అన్నారు.
Telugudesam
cm
kcr
TRS
KTR
hyderabad

More Telugu News