Andhra Pradesh: కేసీఆర్ ని మూడువేల సార్లు తిట్టానట.. ఏం తమ్ముళ్లూ, నాకు తిట్టడం తెలుసా?: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
మూడు నెలల్లో మూడువేల సార్లు తనను చంద్రబాబు తిట్టారని కేసీఆర్ నిన్న విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. గుంటూరులో జరుగుతున్న టీడీపీ ఎన్నికల ప్రచార సభలో బాబు మాట్లాడుతూ, ‘కేసీఆర్ ని మూడువేల సార్లు నేను తిట్టానని అంటున్నాడు. ఏం, తమ్ముళ్లూ! నాకు తిట్టడం తెలుసా? బూతులు ఎప్పుడైనా వాడతానా? నా భాష ఎప్పుడైనా మారుతుందా? గౌరవప్రదంగా ఉంటుందా? లేదా? అదే, కేసీఆర్ మాట్లాడే మాటలు మీరు విన్నారుగా! అసభ్యంగా ఉన్నాయా? లేదా? ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా? లేదా? మనం కూడా అదే మాదిరి ప్రజలను రెచ్చగొడితే కేసీఆర్ ఎక్కడుంటాడు?’ అని  ప్రశ్నించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Chandrababu
kcr

More Telugu News