యూపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి?: ఇండియాటుడే తాజా సర్వే
- 80 స్థానాలలో ఎస్పీ, బీఎస్పీ 40 సీట్లను గెలుచుకునే అవకాశం
- 35 స్థానాలు బీజేపీ ఖాతాలోకి
- కాంగ్రెస్ ఐదు స్థానాలకు పరిమితం
మరోవైపు గత సర్వేతో పోల్చితే ప్రధాని అభ్యర్థిగా మోదీ మోదీ పాప్యులారిటి మరింత పెరిగిందని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో మోదీ ప్రధాని కావాలని 51 శాతం మంది ప్రజలు కోరుకోగా... తాజాగా ఆయన ప్రధాని కావాలని 55 శాతం మంది కోరుకుంటున్నారని తెలిపింది.
గత ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్, ఎస్పీలు కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 7 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ రెండు (సోనియా, రాహుల్) స్థానాలు గెలిచాయి. ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఒక స్థానంలో కూడా గెలవలేకపోయింది.