Rajamouli: 'ఆర్ఆర్ఆర్' టైటిల్ చెప్పండి... ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆఫర్!

  • రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆర్ఆర్ఆర్'
  • 'ఆర్ఆర్ఆర్' అంటే అబ్రివేషన్ చెప్పండి
  • రాజమౌళి పరిశీలిస్తారని ప్రకటన
దర్శకదిగ్గజం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు మంచి టైటిల్ చెబితే, దాన్నే పెట్టేందుకు ఆలోచిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన కథ అందరికీ తెలుసునని, దాన్ని ఆధారంగా చేసుకుని 'ఆర్ఆర్ఆర్' అనే అబ్రివేషన్ కు మంచి టైటిల్స్ చెప్పాలని డీవీవీ ఎంటర్ టెయిన్ మెంట్స్ కోరింది. అభిమానులు పలు టైటిల్స్ ను పంపవచ్చని, వాటిని రాజమౌళి స్వయంగా పరిశీలిస్తారని వెల్లడించింది. అభిమానులు తమ టైటిల్స్ ను ట్వీట్ చేయాలని సూచించింది. కాగా, ఇప్పటికే అభిమానులు పలు టైటిల్స్ పంపుతున్నట్టు తెలుస్తోంది.



Rajamouli
Ramcharan
RRR
NTR
Abrivations

More Telugu News