Hindupuram: నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్న బాలకృష్ణ!

  • హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలయ్య
  • 22న నామినేషన్ వేయాలని నిర్ణయం
  • భారీ ర్యాలీకి ఏర్పాట్లు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి బాలకృష్ణ, తన నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఆర్వో వంశీ కాక, తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. "హిందూపురంలో బాలకృష్ణ 22వ తేదీన నామినేషన్ వేస్తారు" అని పేర్కొన్నారు. కాగా, బాలకృష్ణ నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ జరిపేందుకు పట్టణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.



Hindupuram
Balakrishna
Nomination
Telugudesam
Andhra Pradesh

More Telugu News