Elections: ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు
  • 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
  • సజావుగా జరిగేందుకు సహకరించాలన్న ద్వివేది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. 25 లోక్‌ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువరించామని చెప్పిన ద్వివేది, వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ లు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ 11 గంటల్లోపు ముగియాలని, ఆపై నామినేషన్‌ లను స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

కాగా, ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, మిగతా పార్టీలు వెనకున్నాయి. తెలుగుదేశం పార్టీ 35 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పేరును కూడా ప్రకటించలేదు. కాగా, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వచ్చేనెల 11న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నోటిఫికేషన్ విడుదలైంది.
Elections
Andhra Pradesh
Telangana
India
Notification

More Telugu News