nayanatara: విజయ్ దేవరకొండ మూవీలో నయనతార?

  • తమిళ సినిమాలో విజయ్ దేవరకొండ 
  • యువ దర్శకుడి పరిచయం 
  • తెలుగులోను రిలీజ్ చేసే ఆలోచన
కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచే విజయ్ దేవరకొండ తన దూకుడును చూపించడం మొదలుపెట్టాడు. మూడు .. నాలుగు హిట్స్ పడగానే ఆయన ఇతర భాషా చిత్రాల్లో నటించడానికీ .. అక్కడ మార్కెట్ ను పెంచుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎస్.ఆర్ ప్రభు నిర్మాణంలో ఒక తమిళ సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ద్వారా ఒక తమిళ యువ దర్శకుడు పరిచయం కానున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో నయనతార చేయనుందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. కథ ..పాత్ర నచ్చితే యువ కథానాయకుల సరసన నటించడానికి నయనతార ఎంతమాత్రం వెనుకాడదు. తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించనుందా?.. లేదంటే కీలకమైన పాత్రలో కనిపించనుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.  
nayanatara

More Telugu News