prabhas: విలన్ కి వీడ్కోలు చెప్పిన 'సాహో' టీమ్

  • షూటింగు దశలో 'సాహో'
  • అరుణ్ విజయ్ పోర్షన్ పూర్తి
  •  ఆగస్టు 15వ తేదీన రిలీజ్
తమిళనాట ఒకవైపున హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున విలన్ పాత్రలను చేస్తూ అరుణ్ విజయ్ బిజీగా వున్నాడు. యంగ్ విలన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన, 'సాహో' సినిమాలోను ఒక విలన్ గా కనిపించనున్నాడు. కొన్ని రోజులుగా అరుణ్ విజయ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆయన పోర్షన్ షూటింగు అయిపోయింది. అందువలన ఆయనతో కేక్ కట్ చేయించిన ఈ సినిమా టీమ్ .. ఆత్మీయపరమైన వీడ్కోలు పలికింది. ఈ సినిమాలో తన పాత్ర తనకి మంచి పేరు తెస్తుందనీ, తెలుగు నుంచి తనకి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుందని అరుణ్ విజయ్ భావిస్తున్నాడు. 'సాహో' రిలీజ్ తరువాత ఆయనకి నిజంగానే అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. 
prabhas
shraddha kapoor

More Telugu News