కేసీఆర్ కుమార్తె కవితపై పోటీకి వెయ్యిమంది రైతులు రెడీ!
- పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్
- రసవత్తరంగా మారనున్న నిజామాబాద్ ఎన్నిక
- రైతు సంఘాల నిర్ణయం
పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.