Jagan: నేడు కర్నూల్, అనంతపురం జిల్లాలలో వైఎస్ జగన్ పర్యటన!

  • ఆదివారం నాడు ప్రచారం ప్రారంభించిన వైఎస్ జగన్
  • కాసేపట్లో ఓర్వకల్లులో బహిరంగ సభ
  • ఆపై రాయదుర్గం, రాయచోటిలో పర్యటన
ఆదివారం నాడు ఇడుపులపాయలో ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 25 మంది లోక్ సభ అభ్యర్థులనూ ప్రకటించి, ఆ వెంటనే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేడు కూడా ప్రచారంలోనే బిజీగా గడపనున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చేరుకున్న ఆయన, కాసేపట్లో పాణ్యం నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

 ఓర్వకల్లులో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆయన హెలికాప్టర్ లో అనంతపురం జిల్లాకు వెళతారు. 12 గంటలకు రాయదుర్గంలో జరిగే సభలో పాల్గొన్న తరువాత, రాయచోటికి వచ్చి 2 గంటల సమయంలో ప్రచారం నిర్వహించనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. తన పాదయాత్రలో కవర్ చేయలేకపోయిన నియోజకవర్గాలు, ప్రాంతాలపై జగన్ ప్రత్యేక దృష్టిని సారించారు.
Jagan
Andhra Pradesh
YSRCP
Campaign
Elections

More Telugu News