Pakistan: పాక్ భూభాగంలో భారత్ దాడి తర్వాత.. పాక్ అణుస్థావరంలో పేలిన క్షిపణి?

  • బలూచిస్థాన్‌లోని ఖుస్ద్ అణ్వాయుధ కేంద్రంలో ప్రమాదం
  • 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో పెద్ద మచ్చ
  • ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న ప్రమాద ఆనవాళ్లు
పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత పాక్ అణ్వాయుధాలు తరలించేందుకు ప్రయత్నించిందా? ఈ క్రమంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ప్రమాదానికి గురైందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి 26 దాడుల తర్వాత పాక్ అణుస్థావరాల్లో ఏదైనా కదలిక వచ్చిందా? అన్న సందేహంతో ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేసిన నిపుణులు ఈ విషయాన్ని గుర్తించారు.

ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్న నిపుణులకు బలూచిస్థాన్ ప్రాంతంలోని ఖుస్ద్ అణ్వాయుధ కేంద్రంలోని కొన్ని ఫొటోలు ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఈ స్థావరంలో 46 అణువార్‌ హెడ్లను భద్రపరిచినట్టు అంచనా వేస్తున్నారు. నిజానికి ఇందులో 200 అణువార్ హెడ్లు, క్షిపణులను భద్రపరిచే సామర్థ్యంతో నిర్మించారు.

ఈ నెల 8న ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన నిపుణులకు 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పున అగ్నిప్రమాదం జరిగినట్టు అక్కడి పరిస్థితులను బట్టి గుర్తించారు. ఆ మేరకు భూమిపై పెద్ద మచ్చ కనిపిస్తోంది. కచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని నిపుణులు చెప్పలేకపోతున్నప్పటికీ క్షిపణి పేలడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.
Pakistan
India
nuclear bombs
Warheads
Missiles
satellite photos

More Telugu News