Telangana: ఆంధ్రాలో ఓడిస్తానన్న భయం చంద్రబాబును పట్టుకుంది: సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించి తీరతానని చెప్పిన తనను చంద్రబాబునాయుడు అవహేళన చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నాడు తెలంగాణలో కేసీఆర్ తో ఏమవుతుందని, ఏం చేసినా అన్నీ తన వల్లేనని చంద్రబాబు అనుకున్నారని అన్నారు. అలాంటి చంద్రబాబు నేడు తనను చూసి భయపడుతున్నారని విమర్శించారు. గత మూడు నెలలుగా చంద్రబాబు తనను మూడువేల సార్లు తిట్టారని దుయ్యబట్టారు. ఆంధ్రాలో ఓడిస్తానన్న భయం చంద్రబాబును పట్టుకుందని విమర్శించారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
Andhra Pradesh
babu

More Telugu News