Telangana: ఆంధ్రాలో ఓడిస్తానన్న భయం చంద్రబాబును పట్టుకుంది: సీఎం కేసీఆర్

  • నాడు చంద్రబాబు నన్ను అవహేళన చేశారు
  • ఏం చేసినా అన్నీ బాబు వల్లే అవుతాయనుకున్నారు
  • 3 నెలల్లో చంద్రబాబు నన్ను మూడువేల సార్లు తిట్టాడు
ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించి తీరతానని చెప్పిన తనను చంద్రబాబునాయుడు అవహేళన చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, నాడు తెలంగాణలో కేసీఆర్ తో ఏమవుతుందని, ఏం చేసినా అన్నీ తన వల్లేనని చంద్రబాబు అనుకున్నారని అన్నారు. అలాంటి చంద్రబాబు నేడు తనను చూసి భయపడుతున్నారని విమర్శించారు. గత మూడు నెలలుగా చంద్రబాబు తనను మూడువేల సార్లు తిట్టారని దుయ్యబట్టారు. ఆంధ్రాలో ఓడిస్తానన్న భయం చంద్రబాబును పట్టుకుందని విమర్శించారు.
Telangana
cm
kcr
Andhra Pradesh
babu

More Telugu News