Telangana: బీజేపీ నేతలు మాత్రమే హిందువులు అయినట్టు మాట్లాడుతున్నారు!: సీఎం కేసీఆర్

  • హిందువులు పూజలు చేస్తే బీజేపీ నేతలకెందుకు బాధ?
  • నేను పూజలు చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారు
  • దేశానికి దారుణ గతి పట్టించింది కాంగ్రెస్, బీజేపీలే
బీజేపీ నేతలు మాత్రమే హిందువులు అయినట్టు మాట్లాడుతున్నారు అని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మరి, హిందువులు పూజలు చేస్తే, బీజేపీ నేతలకు ఎందుకు బాధ? సంప్రదాయాలను కాపాడుతున్నామంటారు, తాను పూజలు చేస్తే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.

 భారత్ పరువు పోయేలా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకరినొకరు దొంగ అని విమర్శించుకుంటే దేశం పరువు పోదా? అని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో సమస్య పరిష్కరించకుండా సమస్యలను నాన్చుతున్నారని విమర్శించారు. దేశంలో సమస్యలు పోవాలంటే సమాఖ్య ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.
Telangana
cm
kcr
bjp
modi

More Telugu News