Chandrababu: చంద్రబాబే మా కింద పని చేశారు.. ఆయన కంటే ముందు నుంచే టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నాం: ఎర్రబెల్లి

  • మాలాంటి వాళ్లను తొక్కిపెట్టారు
  • గ్రూపు రాజకీయాలతో పార్టీని నాశనం చేశారు
  • చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
తన కింద పనిచేసిన కేసీఆర్‌కే అంతుంటే తనకెంత ఉండాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము చంద్రబాబు కింద పనిచేయలేదని.. చంద్రబాబే తమకింద పనిచేశారని అన్నారు.

కేసీఆర్, తాను టీడీపీలో చంద్రబాబు కంటే ముందు నుంచే క్రియాశీలకంగా ఉన్నామని ఎర్రబెల్లి తెలిపారు. టీడీపీలో తమలాంటి వాళ్లను ఎందరినో చంద్రబాబు తొక్కిపెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా గ్రూపు రాజకీయాలతో ఆయన టీడీపీ నాశనానికి పాల్పడ్డారని ఎర్రబెల్లి ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ ఓటమి కోసం ప్రయత్నించిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తున్నానన్నారు.
Chandrababu
Telugudesam
Telangana
Errabelli
KCR
Andhra Pradesh

More Telugu News