Vivekananda Reddy: మరోసారి వివేకా ఇంటిని పరిశీలించిన సిట్ అధికారులు

  • దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు
  • వివేకా సోదరులను విచారించిన పోలీసులు
  • వాంగ్మూలం నమోదు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ హత్యపై సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. నేడు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో వివేకా సోదరులు భాస్కర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను పోలీసు అధికారులు విచారించారు. వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీనితో పాటు నేడు మరోసారి వివేకా ఇంటిని పరిశీలించిన సిట్ అధికారులు.. వివేకా కుమార్తె, అల్లుడు, బావమరిది, వివేకా పీఏతో పాటు అనుచరుడైన గంగిరెడ్డిని కూడా విచారించారు.
Vivekananda Reddy
Pulivendula
Bhaskar Reddy
Prathap Reddy
Manohar Reddy
Gangi Reddy

More Telugu News