Pawan Kalyan: ఆమె చూపించిన ప్రేమ, ఆప్యాయత నన్ను కదిలించాయి: పవన్

  • ప్రేజలకు ఏమి చేయాలనే దానిపైనే చర్చ
  • 2008లోనే అధ్యక్షుడిగా ఉండాలని ఆహ్వానం
  • మాయావతిని ప్రధానిగా చూడాలనేది ఆకాంక్ష
తెలంగాణ వస్తే దళితుడిని సీఎంని చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పి మోసం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. లక్నో వెళ్లినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చూపిన ప్రేమాప్యాయతలు తనను కదిలించాయన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య సీట్ల సర్దుబాటు కన్నా ప్రజలకు ఏమి చేయాలనే దానిపైనే చర్చ జరిగిందని తెలిపారు.

2008లోనే బీఎస్పీకి ఏపీ అధ్యక్షుడిగా ఉండాలని తనకు ఆహ్వానం అందిందని, ఇప్పుడు ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. మాయావతిని ప్రధానిగా చూడాలనేది కోట్లాది మంది ఆకాంక్షగా పవన్ పేర్కొన్నారు. పొత్తులపై బీఎస్పీ నేత వీర్‌సింగ్‌తో చర్చిస్తున్నామన్నారు.
Pawan Kalyan
Mayawathi
KCR
BSP
Veer Singh

More Telugu News