Chandrababu: చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ హర్షకుమార్.. అమలాపురం సీటు కేటాయించే అవకాశం!

  • విశాఖ విమానాశ్రయంలో భేటీ
  • రేపే టీడీపీలో చేరనున్న హర్షకుమార్
  • గత ఎన్నికల్లో గెలిచిన రవీంద్రబాబు వైసీపీలో చేరారు
సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలోను, జాబితాల ప్రకటనలోను పార్టీలన్నీ తలమునకలై వున్నాయి. మరోపక్క, అదే సమయంలో వలసలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో నేడు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును కలిసిన హర్షకుమార్ టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

రేపే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచిన రవీంద్రబాబు ఇటీవల వైసీపీలో చేరారు. దాంతో తమ పార్టీ నుంచి దీటైన అభ్యర్థి కోసం టీడీపీ చూస్తున్న తరుణంలో ఆ అవకాశం హర్షకుమార్ కు వచ్చేలా కనిపిస్తోంది.

Chandrababu
Harsha Kumar
Telugudesam
Visakha Airport
Amalapuram
Ravindra Babu

More Telugu News